దర్యాప్తు సంస్థలతో కేంద్రం కుట్ర

ABN , First Publish Date - 2020-12-29T09:07:48+05:30 IST

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని.. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను

దర్యాప్తు సంస్థలతో కేంద్రం కుట్ర

మా సర్కారును కూల్చే కుతంత్రం

ఈడీ, సీబీఐలను రాజకీయంగా వాడుకుంటున్నారు: శివసేన


ముంబై, డిసెంబరు 28: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని.. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ‘‘బీజేపీ నేతలు కుట్రలకు తెర తీశారు. మా ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీ కేసులు బనాయిస్తున్నారు. వేధింపులతో 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. సంజయ్‌ రౌత్‌ భార్యకు ఓ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. బీజేపీ నేతలు సంజయ్‌ రౌత్‌పై ట్వీట్ల యుద్ధాన్ని ప్రారంభించారు. దీనిపై రౌత్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. మా దగ్గర రూ.1,600 కోట్లు ఎక్కడివి? ఈడీ సమన్లలో విషయం ఏంటో ప్రస్తావించలేదు. బీజేపీ నాయకులు మాత్రం ఏవో లెక్కలు చెబుతున్నారు. ఈడీకి త్వరలోనే సమాధానం చెప్తాం’’ అని వ్యాఖ్యానించారు. తన వద్ద బీజేపీకి చెందిన 121 మంది చిట్టా ఉందని.. దాన్ని ఈడీకి ఇస్తానని.. వారంతా మనీలాండరింగ్‌ విచారణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాకూర్‌ కూడా ఇది రాజకీయ దురుద్దేశమేనంటూ బీజేపీపై మండిపడ్డారు. 

Updated Date - 2020-12-29T09:07:48+05:30 IST