51 కోట్లను విరాళంగా ప్రకటించిన షిర్డీ సాయి సంస్థానం

ABN , First Publish Date - 2020-03-28T01:57:45+05:30 IST

కోవిడ్ - 19 ను ఎదుర్కొనే క్రమంలో షిర్డీ సాయి సంస్థాన్ తన ఉదారతను చాటుకుంది.

51 కోట్లను విరాళంగా ప్రకటించిన షిర్డీ సాయి సంస్థానం

ముంబై : కోవిడ్ - 19 ను ఎదుర్కొనే క్రమంలో షిర్డీ సాయి సంస్థాన్ తన ఉదారతను చాటుకుంది. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 కోట్ల రూపాయల విరాళాన్ని శుక్రవారం ప్రకటించింది. మహారాష్ట్రలో వివిధ సామాజిక సంస్థలు కూడా ఇదే విధంగా విరాళాలు ప్రకటించాయి. శివసేనతో పాటు ఎన్సీపీ ప్రజా ప్రతినిధులు కూడా నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. 

Updated Date - 2020-03-28T01:57:45+05:30 IST