విరిగిపడిన కొండచరియలు..సిమ్లా-చండీఘడ్ రహదారి మూసివేత

ABN , First Publish Date - 2020-09-29T13:48:53+05:30 IST

గత 10రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా-చండీఘడ్ జాతీయ రహదారిని మూసివేశారు....

విరిగిపడిన కొండచరియలు..సిమ్లా-చండీఘడ్ రహదారి మూసివేత

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): గత 10రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా-చండీఘడ్ జాతీయ రహదారిని మూసివేశారు. సోలన్ జిల్లాలోని వక్నాఘాట్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో సిమ్లా-చండీఘడ్ జాతీయ రహదారిని మూసివేశామని సిమ్లా పోలీసులు చెప్పారు. వాహనాలను కుఫ్రీ-కందఘాట్, మెహ్లీ-కందఘాట్ వయా జుంగా, టూటూ, కునిహర్ ల మీదుగా మళ్లించామని పోలీసులు చెప్పారు. 


రాంపూర్, రోహ్రూ, కోట్ ఖై, చోపాల్ వాసులు ఛైలా సోలాన్ మార్గంలో నేరిపూల్, గిరిపూల్ ల మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో శిథిలాలను తొలగించి రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T13:48:53+05:30 IST