బట్టలు ఉతికి, బాత్రూమ్ శుభ్రం చేసిన శిఖర్ ధావన్

ABN , First Publish Date - 2020-03-25T18:05:45+05:30 IST

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.ఇది వైరల్ అయ్యింది. కరోనావైరస్ సంక్రమణ కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా పోటీలను వాయిదా వేయడమో...

బట్టలు ఉతికి, బాత్రూమ్ శుభ్రం చేసిన శిఖర్ ధావన్

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. కరోనావైరస్ సంక్రమణ కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా పోటీలను వాయిదా వేయడమో లేదా  రద్దు చేయడమో జరిగింది. దీనితో చాలా మంది క్రికెటర్లు తమ కుటుంబాలతో గడుపుతున్నారు. కరోనావైరస్ సంక్రమణ కారణంగా సామాజిక దూరం పాటిస్తూ ఇంటి నుండి బయటకు రావడం లేదు. శిఖర్ ధావన్ షేర్ చేసిన వీడియోలో ధావన్ బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం చేయడం కనిపిస్తుంది. అలాగే అతనిని  భార్య ఆయేషా ధావన్‌ మందలించడం కూడా కనిపిస్తుంది. ధావన్ ఈ వీడియోను సరదాగా అందరితో  పంచుకున్నాడు. ఈ వీడియోలో అతని భార్య అద్దం ముందు అలంకరించుకోవడం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అతని భాగస్వామి అయిన డేవిడ్ వార్నర్ ఈ వీడియోను షేర్ చేశారు.Read more