భర్తకు విడాకులిచ్చింది... కొడుకును పెళ్ళి చేసుకుంది

ABN , First Publish Date - 2020-07-15T23:50:06+05:30 IST

భర్తకు విడాకులిచ్చింది... కొడుకును పెళ్ళి చేసుకుంది

భర్తకు విడాకులిచ్చింది... కొడుకును పెళ్ళి చేసుకుంది

మాస్కో : ఇష్టపడి పెళ్ళి చేసుకుంది. తర్వాత... ఆ భర్తకు విడాకులిచ్చింది., అంతటితో ఊరుకోలేదు., ఏకంగా కొడుకునే పెళ్ళి చేసుకుంది... నమ్మశక్యంగా లేకపోయినా... నమ్మాల్సిందే. వివరాలిలా ఉన్నాయి. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల  మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే పదేళ్ల కొడుకున్నాడు.


మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ప్రేమగానే చూసుకొనేది. అయితే... కొన్ని నెలల కిందట అర్రేతో స్పర్థలు రావడబంతో... మరీనా అతడికి విడాకులిచ్చింది. ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే... పదేళ్లపాటు ఆమెతోపాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్... మరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్‌కు ఇప్పుడు ఇరవై ఏళ్లు. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా... వ్లాడిమిర్ మాత్రం నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు.


దీంతో తమ మధ్య ఉన్నది తల్లీకొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది కూడా. ఇందుకు అతడు కూడా అంగీకరించాడు. తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తన మాజీ భార్య కోడలిగా ఇంటికి తిరిగి వస్తుందని తెలిసి తీవ్రఆవేదనకు గురయ్యాడు. కానీ, కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే అంగీకరించాడు.

Updated Date - 2020-07-15T23:50:06+05:30 IST