శశి ధరూర్, అద్నాన్ సమీ మధ్య ట్విట్టర్ వార్
ABN , First Publish Date - 2020-04-05T11:41:53+05:30 IST
కాంగ్రెస్ నేత శశి థరూర్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఏప్రిల్ 5 న ప్రధాని మోదీ దీపాలు వెలిగించాలని కోరడంపై

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశి థరూర్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఏప్రిల్ 5 న ప్రధాని మోదీ దీపాలు వెలిగించాలని కోరడంపై శశి అభ్యంతరం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. దీనికి అద్నాన్ సమీ తగిన సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు అకస్మాత్తుగా లైట్ ఆఫ్ చేసి, 9.09 కి ఆన్ చేస్తే ఎలక్ట్రిక్ గ్రిడ్ క్రాష్ అవుతుందని శశి అన్నారు. దీనికి ప్రతిస్పందనగా అద్నాన్ సమీ... ప్రజలను ఏకం చేసేందుకే ఈ పని అని అన్నారు. అయితే శశి థరూర్‌కు ఇది నచ్చలేదు. దీనితో మరోసారి ట్వీట్ చేశాడు... సోదరా... మీ సందేశం హిందుస్తానీలో ఉంటే బాగా అర్థం చేసుకునేవాడిని. వెలుగులు ఉన్నప్పుడు ప్రజలను చీకటిలో ఎందుకు ఉంచాలో అర్ధం కావడం లేదన్నారు. అలాగే విద్యుత్ లేకుండా లిఫ్ట్ ఎలా నడుస్తుంది? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అద్నాన్.... సోదరా... మీ మొదటి ట్వీట్ ఆంగ్ల భాషలో ఉన్నందున నేను ఇంగ్లీషులో రాశాను. ఇప్పుడు మీరు హిందీలో ఏది రాసినా, హిందీలో సమాధానం ఇస్తాను... మీ హృదయంలో కాంతిని ఉంచండి. లిఫ్ట్ గురించి చింతించకండి. కొద్దిసేపటిలో తెరుచుకుంటుంది... అని రాశారు. కాగా అద్నాన్ సమీ ట్వీట్‌ను చూసి, చాలామంది ఆయనను తెగ మెచ్చుకుంటున్నారు.