శంకరాచార్య విగ్రహంపై ఓ మతపు జెండా

ABN , First Publish Date - 2020-08-15T08:35:32+05:30 IST

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా శృంగేరి లోని శంకరాచార్య విగ్రహంపై ఒక మతానికి చెందిన జెండా కప్పి మత విద్వేషాలు సృష్టించేందుకు కుట్రపన్నిన యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్పీ హకాచ్‌ అక్షయ్‌...

శంకరాచార్య విగ్రహంపై ఓ మతపు జెండా

  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్‌


బెంగళూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా శృంగేరి లోని శంకరాచార్య విగ్రహంపై ఒక మతానికి చెందిన జెండా కప్పి మత విద్వేషాలు సృష్టించేందుకు కుట్రపన్నిన యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్పీ హకాచ్‌ అక్షయ్‌ మచీంద్ర శుక్రవారం మీడియాకు తెలిపారు. బెంగళూరు హింసాకాండ అనంతరం వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మిలింద్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఒకచోరీ కేసులో తనను పోలీసులు అరెస్టుచేసి వేధించడంతో వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశానని ఇంటరాగేషన్‌లో నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. హింసాకాండలో కాలిపోయిన ఇంటి స్థానం లో కొత్త ఇంటిని కట్టిస్తామని ముస్లిం మతగురువులు పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి ప్రతిపాదించా రు. దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. కాగా, వివాదాస్పద పోస్టిం గ్‌ చేసిన నవీన్‌ను హతమారిస్తే రూ.51 లక్షలు ఇస్తానంటూ మీరట్‌ నివాసి రూపొందించిన వీడియో వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2020-08-15T08:35:32+05:30 IST