షారూక్ ఖాన్-దీపిక ఫొటోతో పోలీసుల వినూత్న ప్రచారం

ABN , First Publish Date - 2020-04-07T22:07:11+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19పై పోరుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మార్గం సామాజిక దూరం పాటించడం.

షారూక్ ఖాన్-దీపిక ఫొటోతో పోలీసుల వినూత్న ప్రచారం

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19పై పోరుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మార్గం సామాజిక దూరం పాటించడం. దేశం ప్రజలను భయపెడుతున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ కూడా ప్రకటించింది. ఇంట్లో ఉండడమే సురక్షితమని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని నాగ్‌పూర్ పోలీసులు కాస్తంత వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలోని షారూక్ ఖాన్, దీపిక పడుకొనె ఫొటోను ట్వీట్ చేసి చెబుతున్నారు. ఇందులో ఓ బెంచీపై దీపిక పడుకొనె ఈ చివరన కూర్చుకుంటే షారూక్ ఆ చివరన కూర్చుంటాడు. సోషల్ డిస్టెన్స్ అంటే ఇదేనని, చేయి తాకనంత దూరంలో ఉండాలంటూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఉండడమో, సామాజిక దూరం పాటించడమో చేయాలంటూ ఈ ట్వీట్ ద్వారా నాగ్‌పూర్ పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.  

Read more