ఓటు వేసేందుకు కదిలిన షాహీన్ బాగ్... కట్టుదిట్టమైన భద్రత మధ్య...

ABN , First Publish Date - 2020-02-08T17:23:21+05:30 IST

షాహీన్ బాగ్... పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమానికి వేదికగా.. దాదాపు రెండు నెలల నుంచి మార్మోగుతున్న..

ఓటు వేసేందుకు కదిలిన షాహీన్ బాగ్... కట్టుదిట్టమైన భద్రత మధ్య...

న్యూఢిల్లీ: షాహీన్ బాగ్...  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమానికి వేదికగా.. దాదాపు రెండు నెలల నుంచి మార్మోగుతున్న ప్రదేశం... అసెంబ్లీ ఎన్నికల్లో్ భాగంగా ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో ఢిల్లీ మొత్తం ఒక ఎత్తైతే.. షాహీన్ బాగ్ మరో ఎత్తు. ఇన్నాళ్లూ ఆందోళన బాట పట్టిన స్థానికులు ఇవాళ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్లు వేసేందుకు ఉపక్రమించారు. ఇటీవల జరిగిన పలు కాల్పుల ఘటనలో పాటు గత రాత్రి కూడా ఇక్కడ కాల్పులు కలకలం రేపడంతో  పరిస్థితి  సున్నితంగా మారింది. ఇప్పటికే షాహీన్‌ బాగ్‌లోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ముస్లింలు అత్యధికంగా నివసించే షాహీన్ బాగ్... ఓక్లా నియోజకవర్గంలో ఉంది. ఆమాద్మీ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అమనతుల్లా.. బీజేపీ అభ్యర్థి బ్రహ్మసింగ్ బిధూరి, కాంగ్రెస్ అభ్యర్థి పర్వేజ్‌ హష్మిలతో పోటీపడుతున్నారు.  

Updated Date - 2020-02-08T17:23:21+05:30 IST