పెళ్లికి ముందు శారీరక సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం: ఒడిశా హైకోర్టు
ABN , First Publish Date - 2020-05-24T19:01:39+05:30 IST
ఓ బాలికను రేప్ చేశాడన్న కారణంగా అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు..

కటక్: ఓ బాలికను రేప్ చేశాడన్న కారణంగా అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చర్చనీయాంశంగా మారింది. అతని బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమె అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది.
భారతీయ శిక్షాస్మృతిలో అత్యాచారానికి ఇచ్చిన నిర్వచనాన్ని జస్టిస్ పాణిగ్రహి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆమె అంగీకారం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం, ఆమె అయిష్టతను లెక్కచేయకుండా బలవంతం చేయడం.. ఇంకా పలు కారణాలు అత్యాచారం కిందకు వస్తాయని జస్టిస్ చెప్పారు. ఈ తీర్పు విషయంలో న్యాయస్థానం స్పష్టమైన వైఖరితోనే ఉందని, మహిళ అంగీకారంతో.. ఆమె ఎంపికతో శారీరక సంబంధం కొనసాగించడం అత్యాచారం కిందకు రాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది.