కోర్కె తీర్చలేదని... ఉద్యోగం నుంచి తొలగించారు
ABN , First Publish Date - 2020-07-10T20:10:44+05:30 IST
కోరిక తీర్చలేదని ఓ ఉద్యోగినిని ఉద్యోగం నుంచి తొలగించారు ఆమె పై అధికారులు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులోని ఓ ప్రైవేట్ లాంజ్‌లో ఓ మహిళ(26) కొంతకాలంగా ఉద్యోగం చేస్తోంది. అక్కడ డ్యూటీ మేనేజర్ కొంత కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీ : కోరిక తీర్చలేదని ఓ ఉద్యోగినిని ఉద్యోగం నుంచి తొలగించారు ఆమె పై అధికారులు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులోని ఓ ప్రైవేట్ లాంజ్‌లో ఓ మహిళ(26) కొంతకాలంగా ఉద్యోగం చేస్తోంది. అక్కడ డ్యూటీ మేనేజర్ కొంత కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది.
దాంతో ఆమె సమస్య పరిష్కారం కాకపోగా... అతడు కూడా ఆమెను తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఆ ఇద్దరు ఉన్నతాధికారులు సుమారు ఆరు నెలలుగా కోరిక తీర్చాలంటూ వెంట పడుతున్నా ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆమె డ్యూటీ ఎక్కే సమయంలో యూనిఫామ్ మార్చుకుంటుండగా జనరల్ మేనేజర్ ఆ గదిలోకి వచ్చాడు.
అర్ధనగ్నంగా ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించగా, బాధితురాలు తప్పించుకుని పారిపోయింది. జనరల్ మేనేజర్ కోరిక తీరిస్తే ప్రమోషన్ వచ్చేదని, మంచి అవకాశం కోల్పోయావని... డ్యూటీ మేనేజర్ ఆమెను తిట్టిపోశాడు. ఈ క్రమంలో... తమ కోరిక తీర్చడం లేదని ఆమెపై కక్షగట్టిన ఆ మేనేజర్లు ఆ మహిళను మూడు రోజుల క్రితం ఎటువంటి నోటీసూ లేకుండానే ఉద్యోగం నుంచి తొలగించారు.
దీంతో బాధితురాలు గురువారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.