కరోనా రోగుల కంటిపై ఫంగస్ దాడి
ABN , First Publish Date - 2020-12-13T08:37:39+05:30 IST
కరోనా రోగులపై ఓ ప్రాణాంతక ఫంగస్ దాడిచేస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారినీ ఇది వదలట్లేదు. ప్రధానంగా మధుమేహం అదుపులో లేనివారు, చక్కెర వ్యాధి నియంత్రణకు బలమైన ఔషధాలు...

అహ్మదాబాద్, డిసెంబరు 12 : కరోనా రోగులపై ఓ ప్రాణాంతక ఫంగస్ దాడిచేస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారినీ ఇది వదలట్లేదు. ప్రధానంగా మధుమేహం అదుపులో లేనివారు, చక్కెర వ్యాధి నియంత్రణకు బలమైన ఔషధాలు, స్టెరాయిడ్స్‌ను వినియోగించే వారిపై దీని ప్రభావం గరిష్ఠంగా ఉంటోంది. ‘మ్యూకర్ మైకోసి్‌స’గా పిలిచే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఐదు కేసులను గుర్తించినట్లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రెటీనా, ఆక్యులర్ ట్రామా సర్జన్ పార్థ్ రాణా వెల్లడించారు. వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు కంటిచూపును కోల్పోయారని చెప్పారు. వీరిలో కనుపాపలు ఉబ్బి బయటికి వచ్చిన లక్షణాలను గుర్తించామని వివరించారు. కరోనా రోగులు షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవడంతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.