వైష్ణోదేవి ఆలయంలోకి రోజుకు 7వేల మంది భక్తులకే ప్రవేశం

ABN , First Publish Date - 2020-10-13T15:19:56+05:30 IST

జమ్మూకశ్మీరులోని త్రికూట హిల్సుపై ఉన్న మాత వైష్ణోదేవి ఆలయంలో రోజుకు 7వేల మంది భక్తులకు ప్రవేశం కల్పించాలని శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించింది....

వైష్ణోదేవి ఆలయంలోకి రోజుకు 7వేల మంది భక్తులకే ప్రవేశం

జమ్మూ : ఈ నెల 17వతేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీరులోని త్రికూట హిల్సుపై ఉన్న మాత వైష్ణోదేవి ఆలయంలో రోజుకు 7వేల మంది భక్తులకు ప్రవేశం కల్పించాలని శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించింది. అక్టోబరు 15వతేదీ నుంచి వైష్ణోదేవి ఆలయ యాత్ర, నవరాత్రి ఏర్పాట్లను ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ కుమార్ బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షించారు. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైష్ణోదేవి భవన్ తోపాటు ఆలయాన్ని పూలతో అలంకరించాలని నిర్ణయించారు.


నవరాత్రి ఉత్సవాల్లో శతచండీ మహాయాగాన్ని నిర్వహించి పూర్ణ ఆహుతి కార్యక్రమం చేపడతామని ఆలయ అధికారులు చెప్పారు. భక్తులు కొవిడ్ నిబంధనలతోపాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాటరీ వాహనాలు, రోప్ వే, హెలికాప్టరు సర్వీసుల ద్వారా యాత్రికులను వైష్ణోదేవి ఆలయానికి రానున్నారు. 

Updated Date - 2020-10-13T15:19:56+05:30 IST