పాకిస్థాన్‌లో పేలుడు...ఏడుగురి మృతి
ABN , First Publish Date - 2020-10-27T16:03:35+05:30 IST
పాకిస్థాన్ దేశంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో నలుగురు మరణించగా...

70 మంది పిల్లలకు తీవ్ర గాయాలు
పెషావర్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ నగరంలోని డైరెక్టరు కాలనీలోని మదరసాలో మంగళవారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా, మరో 70 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పిల్లలను సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్ కు తరలించారు. 20మంది క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పాక్ వైద్యులు చెప్పారు. పేలుడు ఘటనా స్థలానికి ప్రత్యేక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదు. పేలుడుకు కారణాలేమిటి అనేది తాము దర్యాప్తు చేస్తున్నామని పాక్ పోలీసులు చెప్పారు.