లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయుల విడుదల

ABN , First Publish Date - 2020-10-12T12:52:56+05:30 IST

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయ పౌరులను విడుదల చేసినట్లు టూనీషియాలోని భారత రాయబారి తెలిపారు....

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయుల విడుదల

టూనీస్ (టూనీషియా) : లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయ పౌరులను విడుదల చేసినట్లు టూనీషియాలోని భారత రాయబారి తెలిపారు. లిబియాలో ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురిని సెప్టెంబరు 14న లిబియాలోని అశ్వరీఫ్ నుంచి కిడ్నాప్ చేశారు.లిబియాలో రాయబార కార్యాలయం లేకపోవడంతో టూనీషియాలోని భారత మిషన్ భారతీయుల సంక్షేమాన్ని చూస్తోంది. కిడ్నాప్ అయిన ఏడుగురు కార్మికులు సురక్షితంగా విడుదల అయ్యారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. లిబియాలో భద్రతా పరిస్థితులు సరిగా లేనందున భారతీయ పౌరులు అక్కడికి వెళ్లవద్దని 2015 సెప్టెంబరులో భారత విదేశాంగశాఖ సలహా ఇచ్చింది. 


లిబియాకు భారత పౌరులు వెళ్లకుండా నిషేధం ఉన్నప్పటికి కొందరు అక్కడికి వెళ్లి కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నాప్‌కు గురైనవారి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడామని, కిడ్నాపర్ల చెర నుంచి ఏడుగురిని విడిపించామని అనురాగ్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. లిబియాలో భారతీయులు నిర్మాణ, ఆయిల్ కంపెనీల్లో పనిచేస్తున్నారని అనురాగ్ వివరించారు.

Updated Date - 2020-10-12T12:52:56+05:30 IST