ఒకేరోజు ప‌దేళ్ల బాలిక‌తో స‌హా ఏడుగురు ఆత్మ‌హత్య‌!

ABN , First Publish Date - 2020-06-18T18:32:50+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒకే రోజు ఏడు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వీరంద‌రూ ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వీరిలో పదేళ్ల బాలిక‌ కూడా ఉంది. బైష్ణవాఘాట్ నివాసి 57 ఏళ్ల ...

ఒకేరోజు ప‌దేళ్ల బాలిక‌తో స‌హా ఏడుగురు ఆత్మ‌హత్య‌!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒకే రోజు ఏడు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వీరంద‌రూ ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వీరిలో పదేళ్ల బాలిక‌ కూడా ఉంది. బైష్ణవాఘాట్ నివాసి 57 ఏళ్ల నరేష్ సాహా గరియాహత్‌లో దుస్తులు విక్ర‌యించేవాడు. లాక్‌డౌన్ కార‌ణంగా వ్యాపారం న‌డ‌వ‌క అప్పుల పాల‌య్యాడు. ఈ కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. అదేవిధంగా అనుమానాస్ప‌ద స్థితిలో సన్నీ మండల్ అనే పదేళ్ల బాలిక మృత‌దేహం బాల్క‌నీ కిటికీకి వేలాడుతూ పోలీసుల‌కు ల‌భ్య‌మ‌య్యింది. 19 ఏళ్ల యువకుడు తోటన్ దాస్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న స్థితిలో క‌నిపించాడు. అలాగే హిత్ గుప్తా అనే యువ‌కుడు మాన‌సిక ఒత్తిడికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. ఇదేవిధంగా హజ్రా రోడ్ నివాసి మోహన్ బందోపాధ్యాయ (40), నకుల్ మండల్ (70) బెలియాఘాట్‌కుచెందిన‌ 30 ఏళ్ల వ్యక్తి  ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కేసులు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-18T18:32:50+05:30 IST