ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి

ABN , First Publish Date - 2020-06-04T12:16:01+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది....

ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా, ముందుజాగ్రత్తగా వారిని 7 రోజుల పాటు హోంక్వారంటైన్ చేయాలని ఢిల్లీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులకు కరోనా లక్షణాలు ఉంటే, వారిని 14 రోజుల హోంక్వారంటైన్ కు తరలించేవారు. అసింప్టెటామాటిక్ ప్రయాణికులకు కూడా 7 రోజుల పాటు హోంక్వారంటైన్ తప్పనిసరి అని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులందరినీ హోంక్వారంటైన్ చేయాలని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హోం క్వారంటైన్ గడవును 14 రోజుల నుంచి 7 రోజుల వరకు కర్ణాటక సర్కారు కూడా తగ్గించింది. కాగా ఉత్తరాఖండ్ సర్కారు మాత్రం 14 రోజుల క్వారంటైన్ గడవును 21 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-06-04T12:16:01+05:30 IST