లాక్‌డౌన్‌లో కూడా పనిచేసే సంస్థలివే!

ABN , First Publish Date - 2020-04-16T02:09:56+05:30 IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించారు. ఓ పక్క లాక్‌డౌన్ విధించినా, మరో పక్క కొన్ని సంస్థలు పనిచేస్తూనే ఉంటాయి.

లాక్‌డౌన్‌లో కూడా పనిచేసే సంస్థలివే!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించారు. ఓ పక్క లాక్‌డౌన్ విధించినా, మరో పక్క కొన్ని సంస్థలు పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి పనిచేయడం దేశానికి అవసరం. అలాంటి సంస్థలేవో ఓసారి చూద్దామా? ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా(టీవీ ఛానెల్స్ కూడా), డీటీహెచ్ అండ్ కేబుల్ సర్వీసులు లాక్‌డౌన్ సమయంలో కూడా పనిచేస్తాయి. ఇవి పనిచేయకపోతే ప్రజలకు అవసరమైన సమాచారం అందడం కష్టం. ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలిస్తుంది. అప్పటి నుంచి ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు 50శాతం స్టాఫ్‌తో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. అలాగే టూరిస్టులు, అలాగే ఉద్యోగాల కోసం వేరే ఊళ్లలో ఉంటున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న హోటళ్లు, హోంస్టేలు, లాడ్జిలు, మోటెళ్లు, హాస్టళ్లు కూడా పనిచేస్తూనే ఉంటాయి.

Updated Date - 2020-04-16T02:09:56+05:30 IST