ఎంత మంది వస్తే.. అంతా వెళ్లాల్సిందే
ABN , First Publish Date - 2020-11-26T09:46:29+05:30 IST
రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి ఎంత మందిని కే టాయిస్తే.. మళ్లీ అంతే సంఖ్యలో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులను కేటాయించాల్సి ఉంటుందని ఏపీ విద్యుత్

విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ వాదన
న్యూఢిల్లీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి ఎంత మందిని కేటాయిస్తే.. మళ్లీ అంతే సంఖ్యలో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులను కేటాయించాల్సి ఉంటుందని ఏపీ విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను రద్దు చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్ షాలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిసూ.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సరిగ్గానే వ్యవహరించిందని తెలిపారు. నివేదికను రద్దు చేయాలని తెలంగాణ చేసిన వాదనను అంగీకరించవద్దని కోరారు. కాగా, తెలంగాణ విద్యుత్ సంస్థలతో పాటు పలువురు ఉద్యోగులు లేవనెత్తిన పలు అంశాలపై వివరణ ఇవ్వాలని ఏపీకి సూచిస్తూ.. సుప్రీంకోర్టుతీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.