అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో సెన్సెక్స్ జూమ్!

ABN , First Publish Date - 2020-06-26T22:31:02+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి...

అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో సెన్సెక్స్ జూమ్!

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు భారీ లాభాలు నమోదుచేశాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 329.17 పాయింట్లు (0.94 శాతం) ఎగబాకి 35,171.27 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 94.10 పాయింట్లు (0.90 శాతం) లాభపడి 10,383 వద్ద క్లోజ్ అయ్యింది. ఇన్ఫోసిస్ షేరు అత్యధికంగా 7 శాతం లాభం నమోదు చేయగా... టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Updated Date - 2020-06-26T22:31:02+05:30 IST