కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు ఢమాల్!

ABN , First Publish Date - 2020-03-13T00:44:07+05:30 IST

కరోనా వైరస్ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్ విలవిల్లాడిపోయింది.

కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు ఢమాల్!

ముంబై: కరోనా వైరస్ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్ విలవిల్లాడిపోయింది. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీల షేర్ల ధరలూ 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్‌సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 3100 పాయింట్ల మేల కుదేలవగా, నిఫ్టీ 900 పాయింట్లు పతనమైంది. అయితే చివరి గంటలో కొద్దిగా పుంజుకున్న సెన్సెక్స్ 2919 నష్టంతో 32778 వద్ద స్థిరపడింది. గత రెండేళ్లలో ఇదే కనిష్ఠం అవడంతో మదుపర్లు గగ్గోలు పెట్టారు. ఇక నిఫ్టీ 868 పాయింట్లు కోల్పోయి 9590 వద్ద 32 నెలల కనిష్టానికి చేరుకుంది. నష్టపోయిన కంపెనీల్లో బీపీసీఎల్  టాటా మోటార్స్,  యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, మహీంద్రా అండ్‌  మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జిసి, గెయిల్ ఇండియా, హిందాల్కో వంటి సంస్థలు ఉన్నాయి. అయితే టాటా మోటర్స్, లక్షీ బ్యాంక్ కొంత మేర లాభపడ్డాయి. ఇక డాలర్‌కు డిమాండ్ పెరగడంతో కరెన్సీ మార్కెట్లు కూడా నష్టాలు చవిచూసాయి. కేవలం ఒక్క రోజులోనే 61 పైసలు మేర రూపాయి నష్టపోయింది. 


Updated Date - 2020-03-13T00:44:07+05:30 IST