మళ్లీ పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే!
ABN , First Publish Date - 2020-10-28T07:44:02+05:30 IST
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్‌సాల్వే.. మరోసారి పెళ్లిపీటలు ఎక్కనున్నారు...

న్యూఢిల్లీ, అక్టోబరు 27: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్‌సాల్వే.. మరోసారి పెళ్లిపీటలు ఎక్కనున్నారు. 65 ఏళ్ల సాల్వే.. బ్రిటన్‌కు చెందిన కరోలిన్ బ్రొస్సార్డ్ అనే ఓ చిత్రకారిణిని ద్వితీయ వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 28న (బుధవారం) లండన్‌లోని ఓ చర్చిలో ఈ వేడుక నిరాడంబరంగా జరగనుంది.