రేపటి నుంచి మళ్లీ ‘సీరం’ ట్రయల్స్
ABN , First Publish Date - 2020-09-20T07:19:18+05:30 IST
ఆక్స్ఫర్డ్ వర్సిటీ- ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌తో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సోమవారం నుంచి మళ్లీ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది...

పుణె, సెప్టెంబరు 19: ఆక్స్ఫర్డ్ వర్సిటీ- ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌తో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సోమవారం నుంచి మళ్లీ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది. ఇందుకు పుణెలోని సాసూన్ జనరల్ హాస్పిటల్ వేదికగా నిలువనుంది. ఈ దఫా దాదాపు 150 నుంచి 200 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఇందుకు శనివారమే వలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని సాసూన్ ఆస్పత్రి డీన్ మురళీధర్ తాంబే వెల్లడించారు.