17మంది మారుతి సుజుకి సెక్యూరిటీ సిబ్బంది మిస్సింగ్.. అందరూ కరోనా పాజిటివే!

ABN , First Publish Date - 2020-06-24T04:01:41+05:30 IST

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకిలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న 17మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు.

17మంది మారుతి సుజుకి సెక్యూరిటీ సిబ్బంది మిస్సింగ్.. అందరూ కరోనా పాజిటివే!

మానేసర్: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకిలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న 17మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. వీరందరికీ కరోనా అని తేలిన తర్వాతే ఇలా జరగడంతో వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన హరియాణాలోని మానేసర్‌లో గల మారుతి సుజుకి ప్లాంట్‌లో జరిగింది. ఇక్కడ ఓ సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న సిబ్బందిలో 17మందికి కరోనా సోకింది. ఈ విషయం ఈ నెల 17న వెల్లడయింది. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉండాల్సిన వీళ్లు.. కనిపించకుండా పోయారు. వీరిని ట్రేస్ చేయడంలో మెడికల్ సిబ్బంది విఫలమవడంతో ఓ ప్రభుత్వ డాక్టర్.. పోలీసులను సంప్రదించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-06-24T04:01:41+05:30 IST