స్ట్రీట్ డాగ్‌ను 7వ అంతస్తు నుంచి పడేసిన సెక్యూరిటీ గార్డు.... తరువాత...

ABN , First Publish Date - 2020-12-01T16:18:07+05:30 IST

యూపీలోని గజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

స్ట్రీట్ డాగ్‌ను 7వ అంతస్తు నుంచి పడేసిన సెక్యూరిటీ గార్డు.... తరువాత...

గజియాబాద్: యూపీలోని గజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌‌లోని స్టార్ రామేశ్వరం సొసైటీకి చెందిన గార్డు ఒక స్ట్రీట్ డాగ్‌ను ఏడవ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆ శునకం తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న సొసైటీకి చెందినవారంతా కలసి ఆ సెక్యూరిటీ గార్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిని చితకబాదారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు సెక్యూరిటీ గార్డును అరెస్టుచేసి, విచారిస్తున్నారు. ప్రతీరోజు సొసైటీలోకి చొరబడుతున్న స్ట్రీట్ డాగ్‌ను అడ్డుకునేందుకు ఆ సెక్యూరిటీ గార్డు దానిని ఏడవ అంతస్తుకు తీసుకువెళ్లి, అక్కడి నుంచి కిందకు పడేశాడు. దీనిని గమనించిన అక్కడున్నవారంతా అతనిని కొట్టడంతో ఆ సెక్యూరిటీ గార్డు అందరినీ క్షమాపణ కోరాడు. కాగా తీవ్రంగా గాయపడిన ఆ స్ట్రీట్ డాగ్‌కు చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2020-12-01T16:18:07+05:30 IST