బిహార్‌ ఎన్నికలు: రెండవ దశ పోలింగ్‌లో నమోదైన ఓటింగ్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2020-11-04T00:36:36+05:30 IST

రెండవ దశలో 94 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు దశల పోలింగ్‌లో ఎక్కువ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతోంది రెండవ దశలోనే. ఈ దశలోనే మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సహా నితీష్ కుమార్

బిహార్‌ ఎన్నికలు: రెండవ దశ పోలింగ్‌లో నమోదైన ఓటింగ్ ఎంతంటే..?

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండవ దశ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కాగా, మొదటి దశ పోలింగ్‌‌లో నమోదైన ఓటింగ్‌కు అటు ఇటుగా రెండవ దశలో పోలింగ్‌లో నమోదైంది. అక్టోబర్ 28న జరిగిన మొదటి దశ పోలింగ్‌లో 72 నియోజకవర్గాల పరిధిలో 54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ నియోజకవర్గాల్లో 2015లో జరిగిన ఎన్నికల్లో కూడా అటు ఇటుగా ఇదే పోలింగ్ శాతం నమోదైంది. కాగా, రెండవ దశ పోలింగ్‌లో 53.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


రెండవ దశలో 94 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు దశల పోలింగ్‌లో ఎక్కువ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతోంది రెండవ దశలోనే. ఈ దశలోనే మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సహా నితీష్ కుమార్ కేబినేట్‌లోని నలుగురు మంత్రులు బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో 1,447 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మిగిలిన 77 నియోజకవర్గాలకు మూడవ దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 11న విడుదల కానున్నాయి.

Updated Date - 2020-11-04T00:36:36+05:30 IST