కరోనా సెకండ్ వేవ్ డిసెంబరు 15లోపు రావచ్చు...

ABN , First Publish Date - 2020-11-07T13:40:15+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌పై రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ సంచలన వ్యాఖ్యలు...

కరోనా సెకండ్ వేవ్ డిసెంబరు 15లోపు రావచ్చు...

రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలు

జైపూర్ (రాజస్థాన్): కరోనా సెకండ్ వేవ్‌పై రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం డిసెంబరు 15వతేదీ లోపు కరోనా సెకండ్ వేవ్ రావచ్చని వైద్యనిపుణులు హెచ్చరించారని, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ కోరారు. ప్రజలు ఫేస్ మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని, తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి తరచుగా చేతులు కడుక్కోవాలని మంత్రి రఘుశర్మ సూచించారు. ‘‘నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీకా కంటే మాస్కులు ధరించడం మంచిదని, ఎందుకంటే టీకా ప్రభావం 60 శాతానికి మించదని, కాని క్రమం తప్పకుండా మాస్కులు ధరించడం ద్వారా, కరోనా సంక్రమణ అవకాశాలు 90 శాతం తగ్గుతాయి’’ అని డాక్టర్ శర్మ వివరించారు.


ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్టోబర్ 2 న మొత్తం రాష్ట్రంలో “కరోనాకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం” ప్రచారాన్ని ప్రారంభించారని, నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్‌ ఉన్నారు. ఎన్జీఓలు, ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, ఉపాధ్యాయులు స్థానిక సంస్థలతో కలిసి మాస్కులు పంపిణీ చేసి ఈ ఘోరమైన వైరస్ గురించి అవగాహన పెంచుతున్నారు.దీంతోపాటు రాజస్థాన్ రాష్ట్రంలో ‘నో మాస్కు నో ఎంట్రీ ప్రచారం కూడా చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు ప్రజలు మాస్కులు ధరించే వరకు వారిని లోపలకు ప్రవేశించడానికి అనుమతించడం లేదు. 


కరోనా సెకండ్ వేవ్ డిసెంబరు 15కు ముందే రావచ్చని నిపుణులు చెప్పారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సలహా ఇచ్చారు.ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను సాటించాలని మంత్రి రఘుశర్మ కోరారు.శీతాకాలంలో స్వైన్ ఫ్లూ, డెంగీ, జలుబు, దగ్గు, కాలుష్యం పెరుగుతుందని, దీనివల్ల కరోనా కేసులు కూడా పెరుగుతాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించి నెలరోజుల పాటు క్రమశిక్షణ పాటిస్తే కరోనా వైరస్ గొలుసు విచ్ఛిన్నం అవుతుందని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-11-07T13:40:15+05:30 IST