సెకనుకో బిర్యానీ!

ABN , First Publish Date - 2020-12-25T08:23:56+05:30 IST

దేశంలో ఆన్‌లైన్‌లో ఆర్డ ర్‌ చేసి ఆహారాన్ని ఇంటికి తెప్పించుకొనే సంస్కృతి విపరీతంగా పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభిం చిన తరుణంలో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలకు డిమాం డ్‌ పెరిగింది.

సెకనుకో బిర్యానీ!

దేశంలో ఈ ఏడాది ఆన్‌లైన్‌ ఆర్డర్ల తీరిది


న్యూఢిల్లీ, డిసెంబరు 24: దేశంలో ఆన్‌లైన్‌లో ఆర్డ ర్‌ చేసి ఆహారాన్ని ఇంటికి తెప్పించుకొనే సంస్కృతి విపరీతంగా పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభిం చిన తరుణంలో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలకు డిమాం డ్‌ పెరిగింది. ప్రజలు అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వం టకం ఏంటో తెలుసా? బిర్యానీ. 2020లో వెజ్‌, చికెన్‌, మటన్‌.. ఇలా పలు రకాల బిర్యానీలను ఆర్డర్‌ చేసేశారు. ఎంతలా అంటే.. సెకనుకు ఒకటి కంటే ఎక్కు వ బిర్యానీలకు ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ సంస్థ వార్షిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు వచ్చిన లక్షలాది ఆర్డర్లను విశ్లేషించారు. 3 లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులు స్విగ్గీ ద్వారా తొలిసారి చికెన్‌ బిర్యానీనే ఆర్డర్‌ చేయడం విశేషం. ఒక్క వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసేలోపు 6 చికెన్‌ బిర్యానీల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. మొత్తానికి భారతీయులు అత్యంత ఇష్టపడిన ఆహార పదార్థం ‘చికెన్‌ బిర్యానీ’ అని తేల్చారు. జనవరి-మార్చి మధ్యలో ఆఫీసులతో పోలిస్తే ఇళ్లకు ఐదు రెట్లు ఎక్కువగా ఆహార పదార్థాలను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే నెల ల్లో ఇళ్లకు డెలివరీలు 9 రెట్లు పెరగడం విశేషం. అలాగే లాక్‌డౌన్‌ తర్వాత 2 లక్షల పానీపూరీలను కూడా స్విగ్గీ డెలివరీ చేసింది. బలవర్ధకమైన ఆహార పదార్థాల కోసం ఆగస్టులో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో ‘స్విగ్గీ హెల్త్‌ హబ్‌’ను ప్రారంభించగా.. ఢిల్లీవాసులు ఎక్కువగా ఆర్డర్‌ చేశారు.

Updated Date - 2020-12-25T08:23:56+05:30 IST