బ్రిటన్ ప్రభుత్వంతో టిక్‌టాక్ చర్చలు.. కారణం అదేనా..
ABN , First Publish Date - 2020-07-19T22:21:20+05:30 IST
తనపై ఉన్న చైనా యాప్ ముద్రను చెరిపేసేందుకు టిక్‌టాక్ నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలిచేందుకు టిక్‌టాక్ యోచిస్తున్నట్టు సమాచారం.

లండన్: తనపై ఉన్న చైనా యాప్ ముద్రను చెరిపేసేందుకు టిక్‌టాక్ నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలిచేందుకు టిక్‌టాక్ యోచిస్తున్నట్టు సమాచారం. కొత్త కార్యాలయం ఏర్పాటుకు లండన్‌తో పాటు అనేక నగరాలను సంస్థ యాజమాన్యం పరిశీలిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ విషయమై బ్రిటన్ ప్రభుత్వంతో టిక్ టాక్ గత కొద్ది నెలలుగా చర్చల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా తుది నిర్ణయానికి మాత్రం రాలేదట. లండన్‌తో పాటు కాలిఫోర్నియా కూడా టిక్‌టాక్‌కు అనువుగానే ఉంటుందనే వాదన వినబడుతోంది. ఇప్పటికే టిక్‌టాక్ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ఈ వార్తలకు బల్లానిస్తోంది.