క్వారంటైన్‌లో కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-03-18T07:08:48+05:30 IST

కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ నెల 14న తిరువనంతపురం(కేరళ)లోని ‘శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌...

క్వారంటైన్‌లో కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ నెల 14న తిరువనంతపురం(కేరళ)లోని ‘శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ(ఎస్‌‌సీటీఐఎంటీ)’ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత ఆ ఆస్పత్రిలో ఒక వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. తాను వైద్యపరీక్ష చేయించుకున్నానని.. వైరస్‌ నెగెటివ్‌ వచ్చిందని ఆయన వివరించారు. అయితే.. వైరస్‌ సోకిన వైద్యుడిని మంత్రి ఆ రోజు కలవలేదని ఎస్‌సీటీఐఎంటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆశా కిశోర్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-18T07:08:48+05:30 IST