సహచరుడే వెన్నుపోటు పొడిచాడు!

ABN , First Publish Date - 2020-03-12T13:49:32+05:30 IST

రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఆపరేషన్‌ కమలకు సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా అదే తరహాలోనే మధ్యప్రదేశ్‌ సర్కార్‌పై సాగిన ఆపరేషన్‌

సహచరుడే వెన్నుపోటు పొడిచాడు!

  • కాంగ్రెస్‌లో మరోసారి కలవరపాటు
  • నాడు కర్ణాటక... నేడు మధ్యప్రదేశ్‌ 
  • అప్పుడు సిద్దూ ఆప్తులు 
  • ఇప్పుడు రాహుల్‌ సహచరుడు 
  • కావల్సినవారే కుప్పకూల్చారు 
  • ఆపరేషన్‌ కమలలో అదే కోణం 
  • అప్పుడు ముంబైలో.. ఇప్పుడు బెంగళూరు రిసార్ట్‌లో


బెంగళూరు: రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఆపరేషన్‌ కమలకు సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా అదే తరహాలోనే మధ్యప్రదేశ్‌ సర్కార్‌పై సాగిన ఆపరేషన్‌ దాదాపు విజయవంతమైనట్టే అనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో సాగిన రాజకీయ మార్పులకు, కర్ణాటకలో సాగిన రహస్యానికి ఒకే విధంగా బీజేపీ నేతలు ఆపరేషన్‌ కార్యాచరణను అమలు చేశారు. నాడు కర్ణాటక... నేడు మధ్యప్రదేశ్‌ రాజకీయం దేశమంతటా చర్చకు కారణమవుతోంది. రాష్ట్రం లో 18 నెలల సంకీర్ణ ప్రభుత్వం పతనం కా గా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 15 నెలలు కొనసాగింది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పతనం కావడం తథ్యమనిపిస్తోంది. రాష్ట్రంలో మకాం వేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏ క్షణంలోనైనా సంచలన నిర్ణయం తీసుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.


అప్పుడు సిద్దూ ఆప్తులు ఇప్పుడు రాహుల్‌ సహచరుడు 

రాష్ట్రంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్దరామయ్యకు ఆప్తులైన ఎమ్మెల్యేలు ఉండేవారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక సిద్దరామయ్య సీఎల్పీ నేతగా కొనసాగారు. ఆయనకు ఆప్తులుగా ముద్రపడిన 14మంది రాజీనామా చే యడంతో ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్‌ కీలకనేత రాహుల్‌గాంధీకి ఆప్తుడిగా పేరొందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రె్‌సకు గుడ్‌బై చె ప్పడం, ఆయన వెంట ఏకంగా 22మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏక్షణంలోనైనా కూలిపోనుంది. ఇటు సిద్దరామయ్య, అటు రాహుల్‌గాంధీల అనుచరులే ప్రభుత్వాలు కూల్చారని సోషల్‌ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


కర్ణాటకవారు ముంబైలో మధ్యప్రదేశ్‌వారు బెంగళూరులో

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్నికూల్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ముంబై స్టార్‌ హోటల్‌లో భద్రత మధ్యన బస చేయగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు బెంగళూరులోని రిసార్టులో గడుపుతున్నారు. వా రికి కర్ణాటక ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. దేశ రాజకీయ సంచలనాలకు రాష్ట్రం వేదికగా మా రడం పరిపాటిగా మారింది.

Updated Date - 2020-03-12T13:49:32+05:30 IST