రాజ్యసభకు సింధియా నామినేషన్

ABN , First Publish Date - 2020-03-13T20:30:53+05:30 IST

భారతీయ జనతా పార్టీలో ఇటీవల చేరిన జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారంనాడు ఆ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో..

రాజ్యసభకు సింధియా నామినేషన్

భోపాల్: భారతీయ జనతా పార్టీలో ఇటీవల చేరిన జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారంనాడు ఆ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలకు ఈనెల 26న ఎన్నికలు జరుగనున్నాయి.


కాగా, గత బుధవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరారు. దానికి ఒక రోజు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 18 ఏళ్ల పాటు సింధియా కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి తగినంత సంఖ్యా బలం ఉన్నందున సింధియా గెలుపు నల్లేరుమీద నడకే.

Updated Date - 2020-03-13T20:30:53+05:30 IST