మార్చి 31 వరకు పాఠశాలల మూసివేత: సీఎం

ABN , First Publish Date - 2020-12-06T00:48:31+05:30 IST

మార్చి 31 వరకు పాఠశాలల మూసివేత: సీఎం

మార్చి 31 వరకు పాఠశాలల మూసివేత: సీఎం

భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు మూసివేస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించబడదని, వాటిని ప్రాజెక్ట్ పనుల ఆధారంగా అంచనా వేస్తారని సీఎం చెప్పారు.

Updated Date - 2020-12-06T00:48:31+05:30 IST