అక్కడ స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు అన్నీ ఓపెన్!

ABN , First Publish Date - 2020-09-05T18:42:38+05:30 IST

కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకుంటున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాపారాలు పెరిగాయి. ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది...

అక్కడ స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు అన్నీ ఓపెన్!

కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకుంటున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాపారాలు పెరిగాయి. ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. అంతేనా సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు కూడా తెరుచుకున్నాయి. 


ప్రపంచమంతా కరోనా మహమ్మారికి కారణభూతంగా చైనాను చూపుతున్నా డ్రాగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. కరోనా భయం లేకుండా అక్కడి జనజీవనం సామాన్య స్థితికి చేరుకుంటోంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంది.


మిగతా దేశాలు వర్క్ ఫ్రం హోమ్ పేరు జపిస్తుంటే అక్కడి ఆఫీసులు ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఆఫీసు గుమ్మం ముందు యూవి గేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే సెలవు మంజూరు చేస్తున్నారు. 

వేరే దేశాల నుంచి వచ్చేవారు 5 రోజుల ముందు జారీ చేసిన కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 36 యూరోపియన్ దేశాలు, 13 ఆసియా దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.


రాజధాని బీజింగ్‌లో ప్రవేశానికి ఆంక్షలు!

వేరే దేశాల నుంచి వచ్చేవారు చైనా రాజధాని బీజింగ్‌లోకి ప్రవేశం పొందేముందు ఇతర పట్టణాల్లో కొంతకాలం క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలి.  చైనాతో ఫాస్ట్ ట్రాక్ డీల్ చేసుకున్న దేశాలు నుంచి వచ్చేవారు 48 గంటల పాటు, ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. బీజింగ్ మినహా చైనాలోని ఇతర 16 విమానాశ్రయాల వద్ద అంతర్జాతీయ ప్రయాణికుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-05T18:42:38+05:30 IST