4 కోట్ల ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ABN , First Publish Date - 2020-12-30T08:51:42+05:30 IST
వచ్చే ఐదేళ్లలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని నాలుగుకోట్ల మంది ఎస్సీ విద్యార్ధులకు చేరాలన్నదే మోదీ సర్కార్

వచ్చే ఐదేళ్లలో సాధించాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యం
న్యూఢిల్లీ, డిసెంబరు 29: వచ్చే ఐదేళ్లలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని నాలుగుకోట్ల మంది ఎస్సీ విద్యార్ధులకు చేరాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లోత్ చెప్పారు. 60 లక్షలమంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రస్తుతం లబ్ధిపొందుతున్నారని ఆయన మం గళవారం తెలిపారు. స్కాలర్‌షిప్ మొత్తంలో కేంద్రం వాటా 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం వాటా ను క్రమంగా 80 శాతానికి పెంచుతామని తెలిపారు. దీనివల్ల 2025-26 నాటికి కేంద్ర ఖజానాపై రూ.59,048కోట్ల భారం పడుతుందన్నారు.