వీడియో కాన్ఫరెన్స్‌తోనే కేసుల విచారణ: సుప్రీం

ABN , First Publish Date - 2020-03-23T19:46:43+05:30 IST

కరోనా వైరస్‌‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడటం, లాకౌడౌన్లు కొనసాగుతున్న నేపథ్యంలోకరోనా వైరస్‌‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడటం, లాకౌడౌన్లు కొనసాగుతున్న నేపథ్యంలో..

వీడియో కాన్ఫరెన్స్‌తోనే కేసుల విచారణ: సుప్రీం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడటం, లాకౌడౌన్లు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం తక్షణ చర్యలకు దిగింది. 


రేపటి  నుంచి లాయర్ ఛాంబర్లు మూత వేస్తున్నామని, ఎలాంటి ముఖాముఖీ విచారణలు ఉండవని ప్రకటించింది. కీలకమైన కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రేపు సాయంత్రం 5 గంటల్లోగా లాయర్ల ఛాంబర్లు మూసివేతకు సీజేఐ ఎస్ఏ బాబ్డే ఆదేశాలిచ్చారు.


'తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సుప్రీంకోర్టు ఆవరణలో లాయర్లు గుమిగూడరాదు' అని కోర్టు స్పష్టం చేసింది. లాయర్లకు జారీ చేసిన అన్ని ప్రాక్సిమిటీ కార్డులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సీజేఐ బాబ్డే, జస్టిస్ ఎల్.ఎన్.రావు, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అత్యవసర సందర్భాల్లో లాయర్లను కోర్టు ఆవరణలోకి అనుమతించే అధికారం సుప్రీంకోర్టు బచార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాత్రమే ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్ట చేసింది.


కాగా, 2,8,14 కోర్టుల్లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన విచారణలను రద్దు చేస్తూ ఆదివారంనాడు అత్యున్నత న్యాయస్థానం ఓ సర్క్యులర్ విడుదల చేసింది. బుధవారం నుంచి ఇద్దరు జడ్జీలతో కూడిన ఒక బెంచ్ మాత్రమే అత్యతవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తుందని తెలిపింది. సోమవారం నుంచి నాలుగు కోర్టులు పనిచేస్తాయని అంతకు ముందు ఒక నోటిపికేషన్‌లో కోర్టు పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత వివరణ ఇస్తూ, సీజేఐ కూర్చునే కోర్టు నెంబర్-1 మాత్రమే సోమవారం నుంచి విచారణ జరుపుతుందని తెలిపింది.

Updated Date - 2020-03-23T19:46:43+05:30 IST