కేయూడబ్ల్యూజే పిటిషన్ విచారణ 4 వారాలు వాయిదా

ABN , First Publish Date - 2020-10-12T20:53:43+05:30 IST

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వారిని అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు పేర్కొన్నారు. వీరికి స్థానిక మధుర కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

కేయూడబ్ల్యూజే పిటిషన్ విచారణ 4 వారాలు వాయిదా

న్యూఢిల్లీ: కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే) వేసిన హెబస్ కార్పస్ విచారణను నాలుగు వారాల తర్వాత వింటామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు తమకు సమయం లేనందున 28 రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని కేయూడబ్ల్యూజేకు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన సిద్ధిఖీ కప్పన్ అనే జర్నలిస్టును హథ్రస్ టోల్‌ప్లాజా వద్ద యూపీ పోలసులు అరెస్ట్ చేశారు.


హథ్రస్‌లో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన దళిత యువతి ఉదంతంపై రిపోర్టు చేసేందుకు అక్టోబర్ 6న హథ్రస్‌కు వెళ్తున్న సిద్ధిఖీ సహా ఆతిఖ్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలం అనే మరో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వారిని అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు పేర్కొన్నారు. వీరికి స్థానిక మధుర కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.


ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేరళలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్) సుప్రీంను ఆశ్రయించింది. రాజ్యాంగ విలువల దృష్ట్యా సిద్ధిఖీని విడుదల చేయాలని సుప్రీంలో వేసిన పిటిషన్‌లో కేయూడబ్ల్యూజే పేర్కొంది.

Updated Date - 2020-10-12T20:53:43+05:30 IST