ఎస్‌బీఐలో వ్యక్తిగత రుణాలు

ABN , First Publish Date - 2020-05-13T14:32:36+05:30 IST

వ్యక్తిగత రుణాలను అందజేయనున్నట్లు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటనలో...

ఎస్‌బీఐలో వ్యక్తిగత రుణాలు

చెన్నై: వ్యక్తిగత రుణాలను అందజేయనున్నట్లు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటనలో... తమ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వినియోగదారులకు వ్యక్తిగత రుణాలు అందించే పథకాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ పథకం ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ ద్వారా జూన్‌ వరకు అమలులో ఉంటుందన్నారు. కనిష్టంగా రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల రుణాలు పొందవచ్చని, 18 నెలల్లోపు రుణాలను తిరిగి చెల్లించాలని, వేతన ఖాతాదారులకు మాత్రమే ఈ రుణాలు అందజేయనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొనింది.


Read more