కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

ABN , First Publish Date - 2020-06-27T00:25:53+05:30 IST

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఆయనకు తాజాగా చేసిన టెస్టులో నెగెటివ్ అని తేలింది.

కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఆయనకు తాజాగా చేసిన టెస్టులో నెగెటివ్ అని తేలింది.

సత్యేంద్ర జైన్ కరోనా లక్షణాలతో జూన్ 17న ఢిల్లీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా తొలుత నెగెటివ్ అని ఆ తర్వాత పాజిటివ్ అని తేలింది. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించి ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన్ను మ్యాక్స్ ఆసుపత్రికి మార్చారు. అక్కడ ఆయనకు ప్లాస్మా థెరపీ నిర్వహించారు. పూర్తి స్థాయిలో కోలుకోవడంతో ఆయన డిశ్చార్జ్ అవుతున్నారు.

అయితే ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారని, సామాన్యులను మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని కేజ్రీవాల్ సర్కారు చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. 

Updated Date - 2020-06-27T00:25:53+05:30 IST