మరో కొవిడ్-19గా సార్స్ వైరస్ ?
ABN , First Publish Date - 2020-05-18T08:59:33+05:30 IST
ఇప్పటి కొవిడ్-19లాగే.. 2003 సంవత్సరంలో సార్స్ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ రెండు వైర్‌సలూ కరోనా కుటుంబానికి చెందినవే. ఈనేపథ్యంలో సార్స్ వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై...

- హెచ్‌సీయూ ప్రొఫెసర్ లలిత అధ్యయన నివేదిక
కల్చరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటి కొవిడ్-19లాగే.. 2003 సంవత్సరంలో సార్స్ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ రెండు వైర్‌సలూ కరోనా కుటుంబానికి చెందినవే. ఈనేపథ్యంలో సార్స్ వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన రసాయనశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ లలితా గురుప్రసాద్ జరిపిన పరిశోధనల్లో ఓ కొత్త విషయం వెలుగుచూసింది. సార్స్ వైర్‌సలోని స్పైక్ ప్రొటీన్లలో ఉండే మూడు సీక్వెన్ రీజియన్లు, డైసల్ఫైడ్ బ్రిడ్జ్‌ల వల్లే వాటి నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని ఆమె కనుగొన్నారు. మనుషులకు సంక్రమించిన కొవిడ్-19 వైరస్, గబ్బిలాలు, పునుగు పిల్లుల్లోని సార్స్ వైర్‌సల జన్యుక్రమాలు, స్పైక్ ప్రొటీన్ల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. గబ్బిలాల్లోని సార్స్ వైరస్ వేగంగా జన్యుపరమైన మార్పులకు లోనవుతోందని, అది భవిష్యత్తులో కొవిడ్-19లా ప్రపంచానికి మరో సవాల్ విసిరే అవకాశాలు లేకపోలేదని లలిత అంచనా వేశారు. ఈమేరకు వివరాలతో ఓ అధ్యయన పత్రాన్ని అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీకి సమర్పించారు.