డబ్ల్యూహెచ్ఓ‌ మార్గదర్శకాలతో పటేల్ కోవిడ్ ఆసుపత్రి

ABN , First Publish Date - 2020-07-05T20:26:31+05:30 IST

ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో డీఆర్‌డీఓ నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

డబ్ల్యూహెచ్ఓ‌ మార్గదర్శకాలతో పటేల్ కోవిడ్ ఆసుపత్రి

న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో డీఆర్‌డీఓ నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారంనాడు సందర్శించారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు.


'డీఆర్‌డీఓ, హోం శాఖ, టాటా సన్స్ ఇండస్ట్రీస్, మరికొన్ని సంస్థల సపోర్ట్‌తో కోవిడ్ పేషెంట్ల కోసం 1000 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. కేవలం 12 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం జరగడం విశేషం' అని రాజ్‌నాథ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందులో 250కి పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ ఉన్నాయని, పూర్తిగా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రి ఏర్పాటు జరిగిందని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఆసుపత్రిని సందర్శంచారు.

Updated Date - 2020-07-05T20:26:31+05:30 IST