సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి నామినేషన్ల గడువు పెంపు

ABN , First Publish Date - 2020-08-21T02:45:42+05:30 IST

సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ గడువును

సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి నామినేషన్ల గడువు పెంపు

న్యూఢిల్లీ : సర్దార్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. భారత దేశ సమైక్యత, సమగ్రతల కోసం కృషి చేసినవారిని సత్కరించేందుకు ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. నామినేషన్లను ఆన్‌లైన్ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వీకరిస్తుంది. నామినేషన్లకు గడువును 2020 అక్టోబరు 31 వరకు పొడిగించింది. 


సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత దేశ సమగ్రత, సమైక్యతలకు పాటుపడినవారిని గుర్తించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. శక్తిమంతమైన, సమైక్య భారత దేశపు విలువను మరింత పటిష్టపరిచేందుకు స్ఫూర్తిదాయకంగా కృషి చేసినవారికి ఈ పురస్కారం అందజేస్తుంది. 


ఈ పురస్కారానికి సంబంధించిన నోటిఫికేషన్ 2019 సెప్టెంబరు 20న జారీ అయింది. మరిన్ని వివరాలకు www.nationalunityawards.mha.gov.inను సందర్శించవచ్చు.


Updated Date - 2020-08-21T02:45:42+05:30 IST