మతం మార్చుకుని, ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి...

ABN , First Publish Date - 2020-04-15T13:46:21+05:30 IST

ఆరు నెలల క్రితం మతం మార్చుకుని, ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు హాజరయిన ఒక యువకునికి కరోనా సోకినట్లు తేలింది. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని దుధారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువకుడు ...

మతం మార్చుకుని, ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి...

సంత్ కబీర్ నగర్: ఆరు నెలల క్రితం మతం మార్చుకుని, ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు హాజరయిన ఒక యువకునికి కరోనా సోకినట్లు తేలింది. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని దుధారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువకుడు మర్కజ్‌కు వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత  వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆ యువకుడు సీతాపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ  యువకునితో  పరిచయం ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ  యువకుడు ఇస్లాం మతంలోకి మారి ముస్లిం అయ్యాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2020-04-15T13:46:21+05:30 IST