కంగనా క్షమాపణలు చెబితే ఆ తర్వాత ఆలోచిస్తా : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2020-09-06T16:25:36+05:30 IST

నటి కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెబితే అప్పుడు ఆమెకు క్షమాపణలు చెప్పే విషయంపై

కంగనా క్షమాపణలు చెబితే ఆ తర్వాత ఆలోచిస్తా : సంజయ్ రౌత్

ముంబై : నటి కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెబితే అప్పుడు ఆమెకు క్షమాపణలు చెప్పే విషయంపై ఆలోచిస్తానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆమె ముంబైను పాకిస్తాన్ అని అన్నారని, అదే వ్యాఖ్యలు అహ్మదాబాద్‌పై అనే దమ్ముందా? అని రౌత్ సూటిగా ప్రశ్నించారు.


ముంబై నగరాన్ని పీఓకేతో పోలుస్తూ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆమె ఓ మెంటల్ కేసు... తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నాయి. ముంబై నగరాన్ని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదు. ముంబై, మహారాష్ట్రను కించపరచడాన్ని తాము సహించం’’ అని రౌత్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-06T16:25:36+05:30 IST