శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై నిషేధం
ABN , First Publish Date - 2020-03-25T07:33:24+05:30 IST
కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మంగళవారం...

న్యూఢిల్లీ, మార్చి 24 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మంగళవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగపడే ఉపకరణాలు, ఆక్సిజన్ థెరపీ పరికరాలు కూడా ఎగుమతి నిషేధం పరిధిలోకి వస్తాయని తెలిపింది.