సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంకు అనారోగ్యం...ఆసుపత్రిలో చేరిక

ABN , First Publish Date - 2020-05-08T13:28:18+05:30 IST

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (80) అనారోగ్యానికి గురవడంతో లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు....

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంకు అనారోగ్యం...ఆసుపత్రిలో చేరిక

లక్నో: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (80) అనారోగ్యానికి గురవడంతో లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఉదరకోశ సమస్యతో బాధపడుతున్న ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని మేదాంత ఆసుపత్రి డైరెక్టరు డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. ములాయంను పరామర్శించేందుకు అతని సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు ఆసుపత్రికి వచ్చారు. ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. 


Updated Date - 2020-05-08T13:28:18+05:30 IST