ఆడుకుంటూ రైలు బోగీ ఎక్కాడు.. అందరూ చూస్తుండగానే..

ABN , First Publish Date - 2020-11-06T15:06:04+05:30 IST

సేలంలో నిలిచివున్న గూడ్సు రైలు బోగీపై ఎక్కి ఆడుకుంటున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం పొన్నమ్మపేట టిప్పునగర్‌ ప్రాంతానికి చెందిన సాహుల్‌అమీద్‌ కుమారుడు మహమ్మద్‌ హుసేన్‌ (16) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.

ఆడుకుంటూ రైలు బోగీ ఎక్కాడు.. అందరూ చూస్తుండగానే..

చెన్నై : సేలంలో నిలిచివున్న గూడ్సు రైలు బోగీపై ఎక్కి ఆడుకుంటున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం పొన్నమ్మపేట టిప్పునగర్‌ ప్రాంతానికి చెందిన సాహుల్‌అమీద్‌ కుమారుడు మహమ్మద్‌ హుసేన్‌ (16) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హుసేన్‌ సెవ్వాయ్‌పేట రైల్వేస్టేషన్‌ రోడ్డులో వస్తూ, నిలిచివున్న గూడ్సు బోగీపైకి ఎక్కాడు, ఊహించని విధంగా పైన ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంలో అతను సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వా స్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-11-06T15:06:04+05:30 IST