సెప్టెంబరునాటికి వేతనాల కోడ్‌ అమలు!

ABN , First Publish Date - 2020-07-10T07:39:17+05:30 IST

వేతనాల కోడ్‌ 2019ను వచ్చే సెప్టెంబరు నాటికి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. కార్మిక సంస్కరణల్లో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన మొదటి చట్టం ఇది. ప్రస్తుతం ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రజాభిప్రాయం కోసం అందుబాటులోకి తెచ్చిందని...

సెప్టెంబరునాటికి వేతనాల కోడ్‌ అమలు!

న్యూఢిల్లీ, జూలై 9: వేతనాల కోడ్‌ 2019ను వచ్చే సెప్టెంబరు నాటికి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. కార్మిక సంస్కరణల్లో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన మొదటి చట్టం ఇది. ప్రస్తుతం ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రజాభిప్రాయం కోసం అందుబాటులోకి తెచ్చిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం అందించడంతోపాటు ఉద్యోగుల వేతనాల్లో జాప్యం జరగకుండా చూడటం వంటి పరిష్కారాలతో కూడిన ఈ చట్టాన్ని గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. కాగా ముసాయిదా నిబంధనలపై 45 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబరు నాటికి ముసాయిదా నిబంధనలను అమలు చేయనున్నట్టు కార్మిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వేతనాల కోడ్‌ మూలంగా దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. 


Updated Date - 2020-07-10T07:39:17+05:30 IST