పెట్రో ధర పెంపు ‘శాడిస్ట్’ చర్య : వీరప్ప మొయిలీ

ABN , First Publish Date - 2020-06-22T23:57:19+05:30 IST

రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం

పెట్రో ధర పెంపు ‘శాడిస్ట్’ చర్య : వీరప్ప మొయిలీ

బెంగళూరు : రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ‘శాడిస్ట్’ చర్య అని తీవ్రంగా దుయ్యబట్టారు. అసలే కోవిడ్‌తో దేశం ఇబ్బంది పడుతోంటే... ప్రజల మానాన ప్రజలను వదిలేశారని ఆయన మండిపడ్డారు. ‘‘కోవిడ్ మహమ్మారి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ప్రభుత్వం మాత్రం ప్రజలను వారి మానాన వారిని వదిలసి.. ప్రజలను ఏడిపిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. 16 రోజుల్లో పెట్రోల్ ధర 8.3 శాతం, డిజీల్ ధర 9.46 శాతం పెరిగిపోయిందని మొయిలీ మండిపడ్డారు. 

Updated Date - 2020-06-22T23:57:19+05:30 IST