గురుద్వారాపై ఉగ్రదాడి బాధ కలిగించింది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-03-25T23:19:45+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని...

గురుద్వారాపై ఉగ్రదాడి బాధ కలిగించింది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడిలో మృతి చెందిన వారి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘కాబూల్ గురుద్వారాపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా బాధించింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని ప్రధాని పేర్కొన్నారు. కాబూల్‌లోని ఓ గురుద్వారాపై ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా దాడి అనంతరం జరిగిన కాల్పుల్లో ఆప్ఘాన్ భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 

Read more